బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY movie) అద్బుతమైన ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్నా కానీ తర్వాత స్లో డౌన్ అయిన సినిమా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా…
భారీగా స్లో డౌన్ అయింది ఇప్పుడు. సినిమా మూడో రోజు హెవీ డ్రాప్ తర్వాత 4వ రోజు ఆదివారం ఏమైనా హోల్డ్ ని చూపిస్తుంది అనుకున్నా కూడా సినిమా మొత్తం మీద మరోసారి డ్రాప్స్ నే సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో…
67 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 89 లక్షల రేంజ్ లో మాత్రమే షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.14Cr
👉Ceeded: 99L
👉UA: 83L
👉East: 51L
👉West: 34L
👉Guntur: 64L
👉Krishna: 44L
👉Nellore: 27L
AP-TG Total:- 7.16CR(11.60Cr~ Gross)
👉KA+ROI – 1.10Cr~
👉OS – 1.72Cr
Total World Wide:- 9.98CR(16.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18.50 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 4 రోజుల్లో సగానికి పైగా రికవరీ చేయగా ఇంకా 8.52 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.