బాస్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో మొత్తం మీద బిలో యావరేజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గని సినిమా సాధించిన బిజినెస్ పెద్దది కాగా ఆ టార్గెట్ ను అయితే అందుకునేలా అయితే కలెక్షన్స్ ని సాధించలేకపోతూ ఉందని చెప్పాలి. అసలు టార్గెట్ లో సగం కూడా అందుకునేలా లేదు సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ చూస్తుంటే అని చెప్పాలి ఇప్పుడు….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత ఇప్పుడు నాలుగో రోజు మొదటి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా చాలా చోట్లా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని కూడా సొంతం చేసుకుంటూ పరుగును మరింత కష్ట తరం చేసుకుంది అని చెప్పాలి. ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో…
25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నా గొప్ప విషయమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విచారకరం అనే చెప్పాలి. క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా 26.30 కోట్లు కలెక్ట్ చేయాలి. 3 రోజుల్లో 4.18 కోట్లు వసూల్ చేసిన గని నాలుగో రోజు భారీగా స్లో అవ్వడంతో ఇక సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకోవడం కన్ఫాం అయింది అని చెప్పాలి.