Home న్యూస్ రూలర్ డే 4 కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే!!

రూలర్ డే 4 కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తప్పితే మిగిలిన రోజుల్లో కలెక్షన్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్ట పడ్డా ఆడియన్స్ థియేటర్స్ కి భారీ సంఖ్య లో రాక పోవడం తో సినిమా వీకెండ్ చాలా వీక్ గా ముగిసింది.

సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది చాలా కీలకంగా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులెత్తేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు తో పోల్చితే ఏకంగా 50% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకున్న సినిమా..

ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అయిన గ్రోత్ ని సాధిస్తుంది అనుకుంటే అదీ జరగలేదు, మొత్తం మీద 5% లోపు గ్రోత్ కొన్ని చోట్ల కనిపించింది, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఇక డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది అని చెప్పాలి. లేట్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్…

మాస్ సెంటర్స్ లో ఊహించని గ్రోత్ ని చూపెడితే తప్పితే సినిమా తేరుకోవడం కష్టం, మొత్తం మీద ఇప్పుడు 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే సాధ్యమని చెప్పాలి.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4 వ రోజు 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద ఈ లెక్కకు మించి కలెక్ట్ చేసినా బిజినెస్ ని అందుకోవడానికి ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి, ఇక 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here