మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 15.09 కోట్ల షేర్ ని అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మాస్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ వీకెండ్ తర్వాత ఇప్పుడు మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకుంది. సినిమా మూడో రోజు ఊహకందని లెవల్ లో గ్రోత్ ని సాధించడం తో నాలుగో రోజు ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…
సినిమా మూడో రోజు తో పోల్చుకుంటే నాలుగో రోజు డ్రాప్స్ తొలి రెండు షోలకు ఏకంగా 60% వరకు ఉండటం తో కొంత షాక్ తిన్నా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల లో తేరుకుని ఆ డ్రాప్స్ ని 10% మేర తగ్గించి మొత్తం మీద 50% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.
మాస్ సెంటర్స్ లో డ్రాప్స్ తక్కువగానే ఉన్నా ఆన్ లైన్ సేల్స్ లో ఎక్కువ డ్రాప్స్ ఉండటం తో సినిమా కలెక్షన్స్ మూడో రోజు మొత్తం మీద 1.8 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కానీ మాస్ సెంటర్స్ లో హోల్డ్ అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్…
అన్నీ అనుకున్నట్లు ఉంటె సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కూడా ఉంది. ఇక మూడో రోజు లెవల్ లో గ్రోత్ మరింత ఎక్కువ ఉంటె 2 కోట్లను మించే అవకాశం కూడా ఉందని చెప్పాలి. మొత్తం మీద 4 వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే సినిమా వర్కింగ్ డే లో బాగానే హోల్డ్ చేసినట్లు అనిపిస్తుంది, ఇక ఇదే జోరు వీక్ మొత్తం కొనసాగితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. ఇక 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.