బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకున్న కస్టడీ మూవీ ఏ దశలో కూడా అంచనాలను అందుకునే కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోలేక పోయింది ఇప్పుడు. వీకెండ్ లోనే సాలిడ్ గా డ్రాప్ అయిన సినిమా వర్కింగ్ డేస్ లో ఇప్పుడు అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన సాలిడ్ గానే డ్రాప్స్ ను ఇప్పుడు సొంతం చేసుకుందని చెప్పాలి.
సినిమా 3వ రోజుతో పోల్చితే 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 40-50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా ఈ డ్రాప్స్ ఇలానే ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
దాంతో సినిమా ఇప్పుడు 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 30 లక్షల నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క 40 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు దరిదాపుల్లోకి వెళ్ళే అవకాశం లేదనే చెప్పాలి. ఇక టోటల్ గా 4 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.