ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా కి తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అవుతున్నా కానీ ఆంధ్రలో మాత్రం తక్కువ టికెట్ రేట్స్ ఎఫెక్ట్ వలన ఆశించిన కలెక్షన్స్ అయితే రావడం లేదు అనే చెప్పాలి. అయినా కానీ ఇదే టైం లో సినిమా…
ఇతర భాషల్లో మట్టుకు అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. సినిమా హిందీలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా తమిళ్ లో కూడా సెన్సేషనల్ హోల్డ్ తో దూసుకు పోతుంది. సినిమా అక్కడ మొత్తం మీద…
6 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా 4 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 13 కోట్లని టచ్ అండ్ గోగా ఉండగా 5 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు…
సినిమా అక్కడ కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాల్లోకి ఎంటర్ అయ్యింది అని చెప్పాలి. లాంగ్ రన్ లో అక్కడ సినిమా మరింత భారీగా లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా 5 రోజుల్లోనే ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను సొంతం చేసుకోవడం, అది కూడా వేరే స్టేట్ లో ఇలాంటి హోల్డ్ ని…
సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా కంప్లీట్ మాస్, రగ్గుడ్ లుక్స్ మనకు చాలా కొత్త కానీ అక్కడ ఇలాంటి కథలు వాళ్ళకి అలవాటు అవ్వడం పుష్ప కి కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇక సినిమా తమిళనాడులో లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వరకు వెల్లగలుగుతుందో చూడాలి ఇక.