బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సామాన్యుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపెట్టలేక పోతుంది అని చెప్పాలి. సినిమా కి కావలసినన్ని థియేటర్స్ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ వసూళ్లు రావడం లేదు. మౌత్ టాక్ దెబ్బ కొట్టడం తో కలెక్షన్స్ పై ఇంపాక్ట్ గట్టిగానే ఉందని చెప్పాలి.వీకెండ్ తర్వాత సినిమా ఇప్పుడు…
వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా 4 వ రోజు 20 లక్షల షేర్ ని సాధించిన ఈ సినిమా 5 వ రోజు కి వచ్చే సరికి అందులో 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 14 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్….
5 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….
👉Nizam: 35L
👉Ceeded: 30L
👉UA: 23L
👉East: 17L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 11L
👉Nellore: 7L
AP-TG Total:- 1.49CR(2.75CR~ Gross)
5.5 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి సినిమా ఇంకా 4.01 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.