ఒక మంచి సినిమా ను ఒక భాష నుండి మరో భాష కి సంభందించిన ఆడియన్స్ కి అందించాలి కాబట్టి రీమేక్స్ విషయం లో ఎలాంటి తప్పు లేదు కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ విస్తారంగా వ్యాప్తి చెంది ఉన్న టైం లో అందరూ అన్ని భాషల సినిమాలను సబ్ టైటిల్స్ తో చూసేస్తూ సినిమా కి భాషతో సంభందం లేదు అని నిరూపిస్తున్న వేల ఇంకా రీమేక్లు చేయడం చాలా కష్టతరం అనే చెప్పాలి.
అయినా కానీ బాలీవుడ్ వాళ్ళు సౌత్ పైనే నమ్మకంతో ఎక్కువ రీమేక్స్ తో గడిపెస్తుండగా… టాలీవుడ్ చాలా తక్కువ రీమేక్స్ నే అడపాదడపా చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక్క భాష కి సంభందించిన రీమేక్లే ఏకంగా 5 సిద్ధంగా ఉండటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అని చెప్పాలి.
మలయాళం లో సూపర్ హిట్ అయిన లేటెస్ట్ మూవీస్ ఐదింటిని తెలుగు లో త్వరలో రీమేక్ చేయబోతున్నారు. వాటిలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ రీమేక్ పెద్దది కాగా… ప్రుద్వీరాజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ మరో పెద్ద సినిమా… ఇవీ ముందు కన్ఫాం అయిన రీమేక్ సినిమాలు..
ఇప్పుడు వీటితో పాటు అయ్యప్పునం కోశియుం సినిమా, చిన్న సినిమా కప్పేల తో పాటు మరో చిన్న సినిమా జోసెఫ్ లు తెలుగు లో రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. వీటితో పాటు తమిళ్ లో హిట్ అయిన కొన్ని సినిమాలు కూడా తెలుగు లో రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం…
కానీ ఓకె భాష కి సంభందించిన 5 సినిమాలు ఓకె సారి రీమేక్ కి సిద్ధం అవుతుండటం మాత్రం ఇదవరకు ఎప్పుడూ జరగలేదు అనే చెప్పాలి. ఇందులో లూసిఫర్ సినిమా అయితే ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయిన సినిమానే అయినా చిరు కోసం చాలా మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారట. మరి ఈ రీమేక్స్ లో ఎన్ని ఒరిజినల్ లా మెప్పిస్తాయో…. ఒరిజినల్ కి మించి సక్సెస్ అవుతాయో చూడాలి…