కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) రీసెంట్ టైంలో మోస్ట్ హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా అని చెప్పొచ్చు, LCU లో సినిమా పార్ట్ అవుతుందా లేదా అన్న ఆసక్తి విజయ్ తో డైరెక్టర్ సెకెండ్ మూవీ అవ్వడంతో హైప్ మరింతగా పెరగగా….
ఆ హైప్ ను సినిమా పూర్తిగా అందుకోలేక పోయింది, మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టాక్ ఇంపాక్ట్ ఏమి పండగ టైంలో లేకుండా సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ దుమ్ము లేపగా మొదటి వారం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత సినిమా…
రెండో వారంలో అడుగు పెట్టి మరోసారి మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా 9 రోజుల్లో 487 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు 10వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 500 కోట్ల హిస్టారికల్ గ్రాస్ మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది ఇప్పుడు…
మిక్సుడ్ రెస్పాన్స్ తో ఈ రేంజ్ లో వసూళ్ళని సినిమా అందుకుంది అంటే అదే పాజిటివ్ టాక్ కనుక సినిమాకి వచ్చి ఉంటే సినిమా కలెక్షన్స్ రాంపేజ్ ఇంకా సాలిడ్ గా ఉండి ఉండేది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండగా…
పరుగును ఇలానే మరో వారం, 10 రోజుల పాటు కొనసాగించే అవకాశం ఎంతైనా ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా విజయ్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి.