బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో చిన్న సినిమానే అయినా కూడా బడ్జెట్ పరంగా పెద్ద సినిమా అయిన రజాకార్(Razakar Movie Collections)…మూవీ డీసెంట్ రిపోర్ట్ లను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగిస్తుంది….
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సినిమా వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేయగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా మిగిలిన సినిమాలతో పోల్చితే పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతున్న సినిమా….
మొత్తం మీద 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…. దాంతో మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్ళని అందుకుందని అంచనా… ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో ఉండగా…
2.20 కోట్ల రేంజ్ లో షేర్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా సినిమా మరో 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నంతలో మిగిలిన సినిమాలతో పోల్చితే ఇది బెటర్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. కానీ అదే టైంలో సినిమా ఓవరాల్ బడ్జెట్ రేంజ్ 50 కోట్ల దాకా ఉండటంతో ఆ బడ్జెట్…
పరంగా చూసుకుంటే మాత్రం సినిమా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలిపినా రికవరీ అవ్వడం మాత్రం కష్టంగానే కనిపిస్తుంది, కానీ సినిమా కి డిజిటల్ రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.