Home గాసిప్స్ రీమేక్ సినిమా కి 54 కోట్ల రెమ్యూనరేషన్ అంట సామి!!

రీమేక్ సినిమా కి 54 కోట్ల రెమ్యూనరేషన్ అంట సామి!!

0

   ఒకప్పుడు సినిమా కి రెమ్యూనరేషన్ అంటే లక్షల్లో ఉండేవి హిరో లకి, కానీ రాను రాను మార్కెట్ పెరుగు తున్న కొద్ది లక్షల నుండి కోట్లు రెమ్యూనరేషన్ తీసు కుంటున్న హీరోలు ఇప్పుడు భారీ ఎత్తున రెమ్యునరేషన్ కి తోడూ సినిమా టోటల్ షేర్ లో ప్రాఫిట్ ని కూడా తీసు కుంటున్నారు. బాలీవుడ్ హీరోలు అయితే ఈ రూట్ లోనే సినిమా కి అవలీలగా 80 నుండి 100 కోట్లు వెనక్కు వేసుకుంటూ దూసుకు పోతున్నారు.

కాగా రీసెంట్ గా తమిళ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన వీరం సినిమాను ఇప్పుడు హిందీ లో రీమేక్ చేయనున్నారు. ముందు షారుఖ్ ఖాన్ తో రీమేక్ చేస్తారు అనుకున్నా చివరి నిమిషంలో అక్షయ్ కుమార్ రీమేక్ లో సెట్ అవ్వగా అప్పుడే ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ కాంచన హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ తో బిజీ గా ఉండగా మరో పక్క రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సూర్యవంశీ సినిమా తో కూడా ఫుల్ బిజీ గా ఉన్నాడు, ఈ రెండు సినిమాలకు రెమ్యూనరేషన్ కాకుండా సినిమాలో ప్రాఫిట్ ని తీసుకుంటున్నాడు అక్షయ్ కుమార్.

కానీ వీరం రీమేక్ విషయం లో అలా కాకుండా నిర్మాత నుండి ఏకంగా 54 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నాడట, ఇది రీసెంట్ టైం లో డైరెక్ట్ రెమ్యూనరేషన్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోల్లో ఒకటి అని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

వీరం సినిమా తెలుగు లో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే, ఇక్కడ అంతగా వర్కౌట్ కాలేదు మరి, బాలీవుడ్ నేటివిటీకి తగ్గ మార్పులు చేర్పులు చేసి ఈ రీమేక్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడట అక్షయ్ కుమార్… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here