Home గాసిప్స్ ఒకరు క్లాస్…ఒకరు మాస్….ఎన్టీఆర్ ఓటు ఎవరికో??

ఒకరు క్లాస్…ఒకరు మాస్….ఎన్టీఆర్ ఓటు ఎవరికో??

0

     టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్న విషయం తెలిసిందే, టెంపర్ నుండి నాన్ స్టాప్ గా ఒక్క ఫ్లాఫ్ లేకుండా కెరీర్ లో ఫుల్ స్పీడ్ తో జోరు చూపుతూ దూసుకు పోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో RRR లాంటి ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, కాగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏది అవుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

కాగా ఈ సినిమా పై ఇండస్ట్రీ లో వార్తలు గట్టిగానే శిఖారు చేస్తున్నాయి, కాగా ఎన్టీఆర్ తర్వాత సినిమా రేసులో ఫైనల్ గా ఇప్పుడు 2 డైరెక్టర్లు ఉన్నారని చెప్పొచ్చు, అందులో లేటెస్ట్ గా కన్నడ ఇండస్ట్రీ రికార్డులతో పాటు సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసి…

బాలీవుడ్ ని కూడా షేక్ చేసిన కే.జి.ఎఫ్. సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉండగా మరో డైరెక్టర్ రీసెంట్ గానే ఎన్టీఆర్ కి అరవింద సమేత లాంటి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రేసులో ముందు ఉన్న డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. KGF పూర్తీ అవ్వడానికి వచ్చే ఏడాది…

చివరి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది అన్న టాక్ ఉంది, అది అయిన వెంటనే ఎన్టీఆర్ కి సరిపోయే కథ రాసుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది, అంటే సినిమా పట్టాలు ఎక్కడానికి 2021 వరకు ఆగాల్సి వచ్చేలా ఉందని చెప్పొచ్చు, కానీ అదే సమయంలో త్రివిక్రమ్ ఇప్పుడు అల్లుఅర్జున్ తో చేస్తున్న సినిమా సంక్రాంతి కి రానుంది.

దాంతో ఇప్పటికే ఎన్టీఆర్ కి చెప్పిన లైన్ ని ఆల్ మోస్ట్ డెవెలప్ చేసిన త్రివిక్రమ్ RRR షూటింగ్ అయిన వెంటనే ఈ సినిమాను మొదలు పెడితే 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయోచ్చు అన్న టాక్ నడుస్తుంది, తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఒకరు క్లాస్ డైరెక్టర్ ఒకరు మాస్ డైరెక్టర్…. మరి ఎన్టీఆర్ ఓటు ముందుగా ఏ డైరెక్టర్ కి వేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here