బాహుబలి తో నేషనల్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే, రానా నటించిన కొత్త సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా టైం అవుతుండగా లేటెస్ట్ మూవీ అరణ్య ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ మొదటి వారం లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా వలన కుదరలేదు.
తర్వాత సినిమా పై ఎలాంటి టాక్ లేదనే చెప్పాలి, థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందా లేక డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుందా అన్న క్లారిటీ లేకుండా 6 నెలలు గడవగా సినిమా గురించిన అప్ డేట్ రీసెంట్ గా సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది.
సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారని, సుమారు 55 కోట్ల రేంజ్ ఆఫర్ సినిమా కి దక్కింది అని టాక్ రాగా, దాని పై టీం ఎలాంటి అప్ డేట్ చేయలేదు, కానీ సడెన్ గా ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది అనౌన్స్ చేశాడు రానా దగ్గుబాటి.
అరణ్య సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే సంక్రాంతి కానుకగా రాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు, దాంతో సడెన్ గా అనౌన్స్ చేయడం పై ఫ్యాన్స్ సంతోషంగా ఉండగా ఇలా చేయడానికి కారణం సినిమా బడ్జెట్ అండ్ ఆఫర్ నచ్చక పోవడమే అనే టాక్ కూడా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది ఇప్పుడు. సినిమా పై ఏకంగా 60 కోట్లకు పైగా….
బడ్జెట్ ని పెట్టిన నిర్మాతలు సినిమా కి 55 కోట్ల దాకా ఆఫర్ వచ్చినా కానీ 65 కోట్లకు పైగా రేటు అడిగారని, దానికి OTT యాప్స్ నో చెప్పడం తో ఇప్పుడు థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఇది బిగ్ స్క్రీన్ పై చూసే విజువల్ ఫీస్ట్ మూవీ అని అంటుండటంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.