బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తీ అయ్యే సరికి 7.6 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది, కాగా సినిమా ఇప్పుడు 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ తో పాటు కొంచం గ్రోత్ ని కూడా మెయిన్ టైన్ చేసింది, తొలి 2 షోల కి అన్ని ఏరియాల్లో డ్రాప్స్ 50% వరకు ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి కొంచం గ్రోత్ పెరిగి…
మొత్తం మీద పర్వాలేదు అనిపించే ఆక్యుపెన్సీ తో రన్ అయినప్పటికీ కొన్ని చోట్ల కురిసిన భారీ వానల వలన సినిమా కి ఎదురుదెబ్బ తగిలింది, మొత్తం మీద 5 వ రోజు నాలుగో రోజు తో పోల్చితే డ్రాప్స్ మొత్తం మీద 45 కన్నా ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు.
కాగా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అన్ని ఏరియాల్లో అనుకున్న లెవల్ లో ట్రెండ్ ని కొనసాగిస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజున 60 లక్షలకు పైగా షేర్ ని అందుకోగలదు, అలా కాక పొతే సినిమా 50 లక్షల రేంజ్ షేర్ ను 5 వ రోజు సాధించవచ్చని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమాకి వచ్చిన టాక్ కి…
ఈ కలెక్షన్స్ కి ఏమాత్రం సంభందం లేదనే చెప్పాలి, మినిమమ్ 3 స్టార్ రేటింగ్ తో ఓపెన్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోవాలి కానీ రాక్షసుడు సినిమా కి అది ఎందుకనో అంతగా అడ్వాంటేజ్ గా మారలేకపోతుంది.
ఇదే విధంగా మిగిలిన రన్ కూడా కొనసాగితే సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు, సినిమా ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆ మార్క్ ని టచ్ చేయకపోవచ్చు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.