Home న్యూస్ 5th డే ఈగల్ కలెక్షన్స్…ఇలా అయితే కష్టం సామి!!

5th డే ఈగల్ కలెక్షన్స్…ఇలా అయితే కష్టం సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) వర్కింగ్ డేస్ లో కొంచం అనుకున్న దాని కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు…

5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 4వ రోజుతో పోల్చితే సినిమా 5వ రోజున 30% రేంజ్ లో డ్రాప్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా మొత్తం మీద సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

Raviteja Eagle 4 Days Total WW Collections!

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 85-90 లక్షల రేంజ్ లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది… ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1 కోటి రేంజ్ దాకా వెళ్ళొచ్చు… కానీ…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి… ఇక అప్ కమింగ్ డేస్ లో గట్టిగా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద 5 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Raviteja Eagle 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here