Home న్యూస్ ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ 20 నిమిషాల ఎపిసోడ్ కి 5 ఏళ్ళు!!

ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ 20 నిమిషాల ఎపిసోడ్ కి 5 ఏళ్ళు!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) 2015 టైం నుండి 2018 టైం వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేయగా అందులో ఒక్క అపజయం లేకుండా దూసుకు పోయాడు…. 2018 టైంలో ఆడియన్స్ ముందుకు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన అరవింద సమేత(Aravindha Sametha)…

సినిమా ఎన్టీఆర్ నుండి వచ్చిన చివరి సోలో మూవీ అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు 2023 పూర్తి అయ్యే టైంకి 5 ఏళ్లలో RRR Movie మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలిసి నటించాడు….

ఇప్పుడు 2024 లో దేవరతో రాబోతున్న ఎన్టీఆర్ అప్పటి వరకు సోలో హీరోగా చేసిన సినిమా అరవింద సమేతనే కాగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి రీసెంట్ గా 5 ఏళ్లని పూర్తి చేసుకోవడం విశేషం అని చెప్పాలి. క్లాస్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో…

ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో మూవీ అంటే అందరూ క్లాస్ మూవీని ఊహించారు, సినిమా స్టార్ట్ అవ్వడం అలానే స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ ఎంట్రీ కూడా చాలా సింపుల్ గా వచ్చినా ఆ తర్వాత ఎపిసోడ్ తన కెరీర్ లోనే ది బెస్ట్ సీన్ అనే చెప్పాలి…. సినిమా ఫస్ట్ 20 నిమిషాల ఎపిసోడ్ మొత్తం…

ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు అటు త్రివిక్రమ్ కెరీర్ లో కూడా ది బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు, అలాంటి ఎపిసోడ్ తర్వాత సినిమా టెంపో పూర్తిగా మారిపోతుంది… అది సినిమా లాంగ్ రన్ కి ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా 90 కోట్ల బిజినెస్ మీద 98 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచిన అరవింద సమేతకి 5 ఏళ్ళు పూర్తి అవ్వగా ఎన్టీఆర్ సోలో హీరోగా చేసే దేవరతో ఏ రేంజ్ లో దుమ్ము లేపుతాడో చూడాలి ఇక…

Young Tiger NTR Fans Created All Time RECORD CDP Trend

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here