బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ మరియు సిద్దార్థ్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం కలెక్షన్స్ కోసం కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాలలో మోస్ట్ ఎఫెక్టెడ్ మూవీ అని చెప్పాలి. బిజినెస్ ఎక్కువ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ని ఇవ్వలేక పోతున్న మహా సముద్రం వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో మరింత ఎఫెక్ట్ ను సొంతం చేసుకుంది.
సినిమా తెలుగు రాష్టాలలో 5 వ రోజు మొత్తం మీద 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 6 వ రోజు హాలిడే దొరికినా కానీ పెద్దగా గ్రోత్ ఏమి చూపలేక పోయిన సినిమా తెలుగు రాష్ట్రాలలో 18 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం.
దాంతో సినిమా 6 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.91Cr
👉Ceeded: 1.13Cr
👉UA: 76L
👉East: 41L
👉West: 32L
👉Guntur: 54L
👉Krishna: 30L
👉Nellore: 25L
AP-TG Total:- 5.62CR(9.46CR~ Gross)
Ka+ROI: 22L
OS – 30L
Total WW: 6.14CR(10.72CR~ Gross)
14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 7.86 కోట్ల దూరంలో ఉంది.