అక్కినేని మూడో తరం హీరో అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మంచి టాక్ నే తొలి ఆటకి సొంతం చేసుకోగా వీకెండ్ వరకు సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించింది, మొత్తం మీద 3 రోజుల వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసింది.
కానీ ఎప్పుడైతే వర్కింగ్ డేస్ మొదలు అయ్యాయో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా స్లో డౌన్ అయింది, చాలా ఏరియాల్లో డెఫిసిట్ లు కూడా పడటం తో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడింది, కామన్ ఆడియన్స్ భారీ ఎత్తున థియేటర్స్ కి రాలేకపోతున్నారు.
కంటెంట్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా కానీ ఎందుకనో ఆడియన్స్ మెప్పు సినిమా సొంతం చేసుకోలేక పోయింది, అది వర్కింగ్ డేస్ లో సినిమా పెర్ఫార్మెన్స్ తో తేటతెల్లం అయింది, సినిమా మూడు రోజుల వర్కింగ్ డేస్ లో కేవలం 90 లక్షల రేంజ్ లో…
కలెక్షన్స్ ని సాధించింది, సినిమా టోటల్ 6 రోజుల కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. Nizam 3.3 cr, Ceeded 1.26 cr, UA 1.2cr, Guntore 1cr, Krishna 0.6 cr, East 0.58cr, West 0.45 cr, Nellore 0.31 cr, Ap/Ts Share 8.7cr, Karnataka 1.1 Cr, Roi 0.2 Cr, USA 0.62, ROW 0.3 Cr, 6 Days WW 10.92 Cr.
22 కోట్లకు సినిమాను అమ్మగా 23 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 13.1 కోట్ల షేర్ ని అందుకోవాలి, అది దాదాపు అసాధ్యమే అవ్వడం తో అఖిల్ ఖాతాలో మూడో ప్లాఫ్ మూవీ పడటం ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది, రెండో వారం లో ఏదైనా అద్బుతం జరిగితేనే ఈ ఫేట్ మారే చాన్స్ ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.