మిస్టర్ మజ్ను డే 3 షాకింగ్ కలెక్షన్స్…F2 ఎఫెక్ట్!

0
1052

     అక్కినేని అఖిల్ నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజుల్లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో 8 కోట్ల లెవల్ లో షేర్ ని అందుకోగా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తో పోల్చితే కొంతవరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, డానికి తోడూ రెండు వారల తర్వాత మూడో వారం లో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న…

F2 సినిమా మిస్టర్ మజ్ను కి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా ఏ నుండి బి సి సెంటర్స్ వరకు ఫుల్ జోరు చూపుతూ 16 వ రోజున 3 వ రోజు లో ఎంటర్ అయిన కొత్త సినిమా కి తీవ్ర పోటి ఇస్తూ దూసుకు పోతుంది, దాంతో ఆ ఎఫెక్ట్ మిస్టర్ మజ్ను పై పడింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఓవరాల్ ఆక్యుపెన్సీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి అనుకున్న రేంజ్ లో పుంజు కోలేక పోయింది ఈ సినిమా, ఓవరాల్ గా 25% వరకు మాత్రమె ఆక్యుపెన్సీ ని టోటల్ గా అందుకోగా బి సి సెంటర్స్ లో…

కేవలం 15% మాత్రమె ఓవరాల్ ఆక్యుపెన్సీ ఉంది, దాంతో మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, అది కూడా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి పెరగడమో తగ్గడమో జరుగుతుంది, F2 పోటి లో లేకుండా ఉంటె సినిమా కచ్చితంగా మరో 10% ఇంప్రూవ్ మెంట్ ఉండేదని చెప్పాలి, కానీ అంత పోటి ఇస్తున్న ఉన్నంతలో మిస్టర్ మజ్ను రోజు ని పర్వాలేదు అనిపించే విధంగా ముగించబోతుంది. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here