చస్….మరో కొత్త ఇండస్ట్రీ రికార్డ్!

0
765

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని ఏమాత్రం ఆపడం లేదు, తెలుగు సినిమా చరిత్రలో మరే మీడియం రేంజ్ సినిమా సాధించని లెవల్ లో కలెక్షన్స్ ఊచకోత ని సినిమా సాధిస్తుండటం విశేషం అనే చెప్పాలి, సంక్రాంతి రేసు లో అన్ని సినిమాల కన్నా లేట్ గా రేసు లో ఎంటర్ అయిన F2….

బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మిగిలిన సినిమాలను సైతం వెనక్కి నెట్టి అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తర్వాత వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లో డౌన్ అయినా కానీ…

స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, ఈ క్రమం లో సినిమా మరే మీడియం రేంజ్ మూవీ టాలీవుడ్ లో అందుకోలేని ఓ అల్టిమేట్ రికార్డ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 19 వ రోజు సాధించిన…

కలెక్షన్స్ తో ఏకంగా 60 కోట్ల హిస్టారికల్ షేర్ మార్క్ ని అందుకుని చారిత్రిక రికార్డ్ ను సొంతం చేసుకుంది, ఇప్పటి వరకు ఏ మీడియం రేంజ్ మూవీ కూడా ఈ మార్క్ ని అందుకోలేదు, టాప్ హీరోల సినిమాలకు మాత్రమె ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమా ఈ మార్క్ ని అందుకుని ఇప్పటికీ స్లో డౌన్ అవ్వకుండా దూసుకు పోతున్న కారణంగా లాంగ్ రన్ లో ఇక్కడ మరో 3 నుండి 5 కోట్ల రేంజ్ లోపు కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు, 4 వ వారం కొత్త సినిమాలు ఏవి లేవు కాబట్టి చాన్స్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here