ప్రస్తుతం టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాలే కరువు అవుతున్న టైం లో రిలీజ్ అవ్వడమే మినిమం 3 స్టార్ టు 3.25 రేంజ్ రేటింగ్ తో రిలీజ్ అయిన బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టపడాల్సి వస్తుంది, ఎంతలా అంటే ఒక ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న సినిమా సేఫ్ అవ్వడానికి ఎలా కష్టపడుతుందో ఈ సినిమా హిట్ టాక్ తో అలాంటి కష్టం పడుతుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులను పూర్తి చేసుకోగా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 48 లక్షల షేర్ ని వసూల్ చేసింది ఈ సినిమా, ఇక వరల్డ్ వైడ్ గా 52 లక్షల షేర్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ గా 6 రోజులకు గాను వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Rakshasudu Day 6 Ap-TG: 0.48Cr
Total 6 Days ApTg Collections: 7.93Cr
Day 6 WW collections: 0.52Cr~
Total 6 Days WW collections: 8.85Cr
Break Even : 17.2cr
Need:- 8.25Cr needed For Break Even
Total Gross: 15.90Cr~ ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల కలెక్షన్స్ పరిస్థితి.
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 8.25 కోట్ల షేర్ ని ఇప్పటి నుండి అందుకోవాల్సి ఉంటుంది, ఆ రేంజ్ టాక్ కి ఈ కలెక్షన్స్ చూసి ఒకింత ట్రేడ్ షాక్ అవుతుండగా తెలుగు ఆడియన్స్ టేస్ట్ ఎలాంటి సినిమాలు కోరుకుంటుందో అని విమర్శలు కూడా మొదలు అయ్యాయి అని చెప్పొచ్చు.
తర్వాత సీన్ ఏం అవుతుందా అన్న ఆసక్తి చివరి వరకు మెయిన్ టైన్ చేసే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను కాకుండా ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారు అంటూ విమర్శించేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రమె ముఖ్యం కాబట్టి సినిమా ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సేఫ్ అవ్వడం కష్టమే అని చెప్పొచ్చు.