Home న్యూస్ 100 కోట్ల సినిమా కోసం 600…గట్టిగా ప్లాన్ చేసిన మంచు విష్ణు!

100 కోట్ల సినిమా కోసం 600…గట్టిగా ప్లాన్ చేసిన మంచు విష్ణు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న నటుల్లో మంచు విష్ణు(Manchu Vishnu) ఒకరు… అప్పుడెప్పుడో దేనికైనా రెడీ లాంటి సినిమాతో హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ హిట్ ని అందుకోలేక పోయిన మంచు విష్ణు రీసెంట్ టైం లో చేసిన ప్రయత్నాలు…

కూడా భారీగా ఎదురుదెబ్బ కొట్టాయి. మోసగాళ్ళు మరియు జిన్నా లాంటి సినిమాల మీద భారీ హోప్స్ పెట్టుకున్నా కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమాల రిజల్ట్ తర్వాత తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో బిగ్ పాన్ ఇండియా మూవీ ని…

మంచు విష్ణు ప్లాన్ చేశాడు… భక్తకన్నప్ప కథనే కన్నప్ప(Kannappa Movie) గా తీస్తూ ఉండగా ఇందులో మహా శివుడి రోల్ లో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ను గెస్ట్ రోల్ కి ఒప్పించడంతో సినిమా మీద హైప్ పెరిగి పోయింది.

ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఏకంగా ఇప్పుడు భారీగా క్రూ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆల్ మోస్ట్ 600 వరకు టెక్నికల్ క్రూ ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా…

టెక్నికల్ గా బ్రిలియంట్ వాల్యూస్ తో ఉండబోతుందని అంటున్నారు ఇప్పుడు… సినిమా మీద ప్రస్తుతం డీసెంట్ అంచనాలు ఉండగా ఓవరాల్ గా సినిమా అంచనాలను అందుకునే విధంగా ఆంటే మంచు విష్ణుకి కెరీర్ లో మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here