Home న్యూస్ మిక్సుడ్ టాక్ తో అక్కడ 100 కోట్లతో కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టిన హృతిక్!

మిక్సుడ్ టాక్ తో అక్కడ 100 కోట్లతో కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టిన హృతిక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్(Fighter Movie) ఆడియన్స్ ముందుకు వచ్చి నెలకు పైనే అవుతుంది. రిలీజ్ టైంలో భారీగా మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక తేరుకునే అవకాశం లేదని అనుకోగా సినిమాకు…

ఇక్కడ ఆడియన్స్ నుండి మరీ అంచనాల రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు కానీ ఓవర్సీస్ ఆడియన్స్ నుండి మాత్రం మంచి రెస్పాన్స్ సొంతం అయ్యిందని చెప్పాలి. అక్కడ హృతిక్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఈ సినిమా దుమ్ము దుమారం లేపింది….

సినిమా మొత్తం మీద ఓవర్సీస్ నుండే 101 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని హృతిక్ కెరీర్ లోనే రికార్డ్ ను నమోదు చేసింది. అందులో అమెరికాలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ను అందుకుంది. ఇక ఇండియా కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇండియాలో సినిమా…

212 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇండియన్ గ్రాస్ 255 కోట్ల దాకా ఉంటుందని అంచనా…దాంతో టోటల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ 34 రోజులకు గాను 356 కోట్ల రేంజ్ లో ఉంటుంది. సినిమా ఇండియాలో హిట్ అనిపించుకోవడానికి 270 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది…

కానీ సినిమా ఆ మార్క్ ని అందుకునే అవకాశం లేదు కానీ ఉన్నంతలో సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా బాగానే పెర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. ముఖ్యంగా ఓవర్సీస్ కలెక్షన్స్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయని చెప్పాలి. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here