బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కంప్లీట్ గా అంచనాలను తప్పాయి. వాటిలో భారీ బడ్జెట్ తో వచ్చిన రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమా కూడా ఒకటి. ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా సినిమా ఎట్టకేలకు అన్ని అవరోధాలను అధిగమించి బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ ఎండ్ టైం లో ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ సినిమా అనుకున్న రేంజ్ లో…
లేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయింది ఈ సినిమా. ట్రేడ్ కి సినిమా పట్ల మొదటి నుండి ఎలాంటి అంచనాలు లేని కారణంగా సినిమాను కొనడానికి అసలు ఎవ్వరూ కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దాంతో సినిమాను మొత్తం మీద…
ఓన్ గానే రిలీజ్ చేయగా సినిమా బడ్జెట్ 60 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ లో 4.85 కోట్ల షేర్ ని మాత్రమే సాధించింది, కానీ సినిమా కి ఎక్కడో ఓ చిన్న ఆశ ఉండేది. హిందీ రిలీజ్ అప్పటికే థియేటర్స్ మూత బడటంతో రిలీజ్ ను ఆపగా…
పరిస్థితులు సెట్ అయ్యాక రిలీజ్ చేస్తారు అనుకున్న సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ కంప్లీట్ గా ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్నా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కష్టమే, రిలీజ్ అయినా జనాలు వస్తారు అనుకోవడం కూడా కష్టమే అవ్వడం తో సినిమాను ఇక హిందీ లో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారట.
దాంతో సినిమా ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే లాస్ ని ఎంతో కొంత హిందీ లో రికవరీ చేస్తుంది అనుకున్న ఇప్పుడు ఆశలు ఆవిరి అయినట్లు అయింది. మొత్తం మీద ఈ సినిమా తో రానా కి నటుడిగా పేరు పెరిగింది కానీ బాక్స్ అఫిఫ్స్ దగ్గర దెబ్బ చాలా గట్టిగా తగిలింది అని చెప్పాలి.