Home న్యూస్ 65 కోట్ల మాస్ బ్లాక్ బస్టర్….మార్కో….తెలుగు బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

65 కోట్ల మాస్ బ్లాక్ బస్టర్….మార్కో….తెలుగు బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మలయాళ ఇండస్ట్రీ నుండి ఎక్స్ లెంట్ హిట్స్ వచ్చాయి…ఇయర్ మొదట్లో ఏకంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సైతం డామినేట్ చేసే రేంజ్ లో హిట్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇయర్ పొడవునా మంచి హిట్ సినిమాలతో కుమ్మేసిన మలయాళ ఇండస్ట్రీ నుండి ఇయర్ ఎండ్ టైంలో…

ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్కో(Marco Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉంది. జాన్ విక్-కిల్ లాంటి అల్ట్రా మాస్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయిన ఈ సినిమా….

కేరళ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకోగా, హిందీ లో కూడా డబ్ అయిన సినిమా అక్కడ కూడా మంచి జోరునే ఇప్పుడు లాంగ్ రన్ లో చూపించగా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది…

ఇక సినిమా కి వస్తున్న రెస్పాన్స్ ను చూసి తెలుగు లో కూడా రిలీజ్ చేయాలనీ సన్నాహాలు మొదలు పెట్టి ఇప్పుడు జనవరి 1 న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. కాగా తెలుగు బిజినెస్ కూడా ఫినిష్ అవ్వగా మొత్తం మీద తెలుగు బిజినెస్…

1.8 కోట్ల లోపు జరిగినట్లు సమాచారం….చాలా డీసెంట్ రేటుకి సినిమా బిజినెస్ జరిగింది అని చెప్పాలి. తెలుగు లో సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సరిపోతుంది. సినిమా అన్ని చోట్లా చూపిస్తున్న జోరు…

మాస్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ నుండి సొంతం చేసుకుంటున్న రెస్పాన్స్ ను చూస్తూ ఉంటే న్యూ ఇయర్ లో టాలీవుడ్ లో క్లీన్ హిట్ గా నిలిచే మొదటి సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా ఇక్కడ ఎంతవరకు అంచనాలను మించి పోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here