ఒక సినిమా అప్ డేట్ ఇవ్వాలి అని యూనిట్ అనుకుంటే ఎంత సేపట్లో ఇవ్వగలరు చెప్పండి… సడెన్ గా అనుకున్నా ఒక గంటలో అప్ డేట్ అనుకుని పోస్టర్ డిసైన్ చేసి ఆడియన్స్ ముందుకు సినిమాను తీసుకు రావొచ్చు. కానీ టాప్ హీరో సినిమా మాత్రం కనీసం అప్ డేట్ కూడా లేక పోవడం తో ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు చిరాకు తెప్పిస్తూ ఏడాది నుండి ఒక్క అప్ డేట్ ఇవ్వడం లేదు…
ఆ సినిమానే కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై సినిమా గురించి… ఈ సినిమా షూటింగ్ ఏడాది నుండి జరుగుతూనే ఉంది, కానీ ఇప్పటి వరకు టైటిల్ రివీల్ చేశారు తప్పితే ఒక్క లుక్ కానీ షూటింగ్ తాలుకూ స్టిల్స్ కానీ రిలీజ్ చేయలేదు.
ఎప్పటి కప్పుడు ఎదో ఒక రీజన్ చెబుతూ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయడం లేదు, అలా డిలే చేస్తున్నా కానీ సినిమా కి తమిళనాడు లో సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో 65 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఫస్ట్ లుక్ కూడా రాకుండానే ఈ రేంజ్ లో బిజినెస్ ను…
సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఈ మే 1 న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ లో ఫస్ట్ లుక్ ని రివీల్ చేయం అంటూ మేకర్స్ నో చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు నార్మల్ గానే ఉన్నప్పటికీ కూడా లుక్ ని రిలీజ్ చేయండి అంటూ రోజు ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేసినా కానీ…
టీం అస్సలు పట్టించు కోవడం లేదు, దాంతో అప్ డేట్ కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడు ఫ్యాన్స్ మేకర్స్ పై తీవ్ర కోపంగా ఉన్నారు. రోజు ఎదో ఒక అప్ డేట్ వస్తుందని ఎదురు చూడటం ఏ అప్ డేట్ లేక పోవడం తో మేకర్స్ పై కోపం చూపడం తోనే సరిపోతుంది గత కొన్ని రోజులలో. కానీ త్వరలోనే సినిమా అప్ డేట్ ఇవ్వబోతున్నారని టాక్ ఉంది. మరి అది నిజం అవుతుందో లేదో చూడాలి.