Home న్యూస్ 6 కోట్ల బడ్జెట్ తో తీస్తే….ఇదీ మిస్ ఇండియా సినిమా బిజినెస్!!

6 కోట్ల బడ్జెట్ తో తీస్తే….ఇదీ మిస్ ఇండియా సినిమా బిజినెస్!!

0

ఒకటి తర్వాత ఒకటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ పోతున్న కీర్తి సురేష్ అన్ని సినిమాలు కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ముందు పెంగ్విన్ సినిమా ఇప్పుడు మిస్ ఇండియా సినిమా తర్వాత గుడ్ లక్ సఖి ఇలా అన్నీ కూడా డైరెక్ట్ రిలీజ్ అవుతూ వస్తుండగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న మిస్ ఇండియా మూవీ సాలిడ్ బిజినెస్ తో దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.

ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో ఈ వీక్ లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతుండగా ఓవరాల్ గా సినిమా సాధించిన ఓవరాల్ బిజినెస్ వివరాలు ట్రేడ్ లో రిలీజ్ అయ్యాయి, ఆ లెక్కల ప్రకారం సినిమా కి అన్నీ కలుపుకుని అల్టిమేట్ బిజినెస్ దక్కింది అని చెప్పవచ్చు…

ట్రేడ్ లో రిలీజ్ అయిన సినిమా బిజినెస్ వివరాల ప్రకారం సినిమా సుమారు 6 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా సినిమాను డిజిటల్ రైట్స్ కింద నెట్ ఫ్లిక్స్ వాళ్ళు 11 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా ఇక్కడే సినిమా కి 5 కోట్ల మేర ప్రాఫిట్ దక్కింది.

ఇక సినిమా కి అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 8 కోట్ల దాకా రేటు దక్కిందని సమాచారం. ఇక మ్యూజిక్ రైట్స్ కింద మరో 40 లక్షల మేర రేటు దక్కిందట. దాంతో ఓవరాల్ గా సినిమా సాధించిన మొత్తం థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు 19.4 కోట్ల రేంజ్ లో ఉండగా హిందీ డబ్బింగ్ బిజినెస్ ఒక్కటి పెండింగ్ అని అంటున్నారు.

మొత్తం మీద సినిమా బిజినెస్ 6 కోట్లకు 19.4 కోట్ల బిజినెస్ ని సాధించగా… టోటల్ గా అందులో బిజినెస్ మీద ప్రాఫిట్ 13.4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. 6 కోట్ల బిజినెస్ మీద 13.4 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here