బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నారా రోహిత్(Nara Rohit) నటించిన ప్రతినిధి2(Prathinidhi 2 Movie) మరియు సత్యదేవ్(Satyadev) నటించిన కృష్ణమ్మ(Krishnamma Movie) వీకెండ్ ని పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమాలు రెండూ పెద్దగా జోరుని అయితే చూపించడం లేదు…
ఎలక్షన్స్ అయిపోయినా కూడా జనాలు సినిమాలను చూడటానికి అయితే పెద్దగా థియేటర్స్ కి రావడం లేదు…దానికి తోడూ సింగిల్ స్క్రీన్స్ కూడా మూసేశారు…ఆ ఇంపాక్ట్ కూడా సినిమాల మీద ఉండగా మొత్తం మీద ప్రతినిధి2 సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 77 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 89 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వాల్యూ టార్గెట్ ను 3.5 కోట్లని అందుకోవాలి అంటే ఇంకా 2.6 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కృష్ణమ్మ మూవీ 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 15 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.56 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.83 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ కి ఇంకా 1.17 కోట్ల రేంజ్ దూరంలో ఉంది. మొత్తం మీద థియేటర్స్ క్లోజ్ ఎఫెక్ట్ ఈ సినిమాలకు కూడా కొనసాగబోతుంది. మల్టీప్లెక్సులలో ఎంతో కొంత జనాలు ఈ వీకెండ్ లో ఈ సినిమాలను చూడటానికి థియేటర్స్ కి వస్తారో రారో చూడాలి ఇక…