Home న్యూస్ 100 కోట్లకు వైపు దూసుకు పోతున్న సైతాన్…వర్కింగ్ డేస్ లో సాలిడ్ హోల్డ్!

100 కోట్లకు వైపు దూసుకు పోతున్న సైతాన్…వర్కింగ్ డేస్ లో సాలిడ్ హోల్డ్!

0

బాలీవుడ్ లో మార్చ్ లాంటి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతుంది అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన లేటెస్ట్ మూవీ సైతాన్(Saithaan Movie) వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు….

సూపర్బ్ హోల్డ్ తో 100 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతూ ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 75.78 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోగా ఇండియా గ్రాస్ లెక్క 6 రోజులకు గాను ఓవరాల్ గా 89 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది. ఇక రెండో వీకెండ్ లో సినిమా ఇదే…

రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉండటంతో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 20.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న వరల్డ్ వైడ్ గా 109.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది…

సినిమా అజయ్ దేవగన్ కెరీర్ లో మరో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని త్వరలో అందుకోబోతుండగా ఈ సినిమా ఇతర భాషల రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడగా తెలుగు లో కూడా ఈ సినిమా రీమేక్ పై చర్చలు భారీగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా పై అప్ డేట్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here