నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 5 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు 6 వ వారంలో ఎంటర్ అవ్వగా సినిమా 5 వ వారం మొత్తం మీద 130 కి పైగా థియేటర్స్ లో రన్ అవ్వగా ఇప్పుడు 6 వ వారంలో ఎంటర్ అవ్వడంతో… ఎన్ని థియేటర్స్ ని సినిమా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా అఖండ సినిమా దుమ్ము లేపేసింది అనే చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 6 వ వారంలో ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అవ్వడం కలిసి రావడంతో తిరిగి థియేటర్స్ ని సాలిడ్ గా పెంచుకుంది. సినిమా నైజాంలో 86 థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా సీడెడ్ లో 45 థియేటర్స్ లో, ఆంధ్రలో 110 థియేటర్స్ లో రన్ అవుతుంది.
దాంతో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు 6వ వారానికి వచ్చే సరికి.. మొత్తం మీద 240 థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తుంది… ఈ రేంజ్ లో థియేటర్స్ ని రిలీజ్ అయిన 6వ వారంలో సొంతం చేసుకోవడం అన్నది మామూలు మాస్ కాదనే చెప్పాలి. ఇక సినిమా ఈ వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.