నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్ బింబిసార లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వచ్చిన సినిమా నే అయినా ఎక్కడా కూడా కలెక్షన్స్ పరంగా జోరు చూపించ లేక పోయింది. మొదటి వీకెండ్ లోనే జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చేసరికి మాత్రం మరింతగా స్లో డౌన్ అయి పోయింది ఇప్పుడు…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6వ రోజులో ఎంటర్ అవ్వగా మరో వర్కింగ్ డే లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఉన్నంతలో 5వ రోజుతో పోల్చితే డ్రాప్స్ కొంచం తక్కువగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంది ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 16 నుండి 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అస్సలు దరిదాపుల్లోకి కూడా వచ్చేందుకు సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా మొత్తం మీద 6 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.