వీకెండ్ వరకు రికార్డుల బెండు తీసిన సినిమా వర్కింగ్ డేస్ లో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు, అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్న ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు మరోసారి 30% రేంజ్ లోనే డ్రాప్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకోగా హిందీ లో ఇంకొంచం ఎక్కువ డ్రాప్స్ నే ఇప్పుడు సొంతం చేసుకుంది. దాంతో ముందు అనుకున్నట్లే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా..
1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో సినిమా ఈ రోజు 3.5 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. కర్ణాటకలో కొంచం పర్వాలేదు అనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నాయి.
మొత్తం మీద సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 6వ రోజున 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ షేర్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉందని చెప్పాలి.
మొత్తం మీద సినిమా మరోసారి వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా ఇక తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.