శర్వానంద్ రితూ వర్మల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
6వ రోజు తో పోల్చితే సినిమా 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 25% రేంజ్ లో డ్రాప్ అవ్వగా మొత్తం మీద ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 25 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 28 లక్షల నుండి 30 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 32 లక్షల నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సినిమా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వీక్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.