లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 2 సినిమాలు సార్ మరియు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు వర్కింగ్ డేస్ లో వేటి లెవల్ లో అవి పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా వీటిలో సార్ మూవీ ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ బాక్స్ ఆఫీస్ ను తెలుగు రాష్ట్రాల్లో షేక్ చేస్తుంది. మరో పక్క కిరణ్ అబ్బవరం…
వినరో భాగ్యము విష్ణు కథ కూడా బ్రేక్ ఈవెన్ వైపు వెళుతూ ఉండగా 6వ రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా మరోసారి లిమిటెడ్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ధనుష్ నటించిన సార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజులో అడుగు పెట్టి అటూ ఇటూగా 15% లోపే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 65 లక్షల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద 2 సినిమాలు ఉన్నంతలో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా సార్ ఫస్ట్ వీక్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి… ఇక వినరో భాగ్యము విష్ణు కథ బ్రేక్ ఈవెన్ కి మరి కొన్ని రోజులు కష్టపడితే క్లీన్ హిట్ అవుతుంది.