ఒక సినిమా ఒక చోట ఆడక పొతే వేరే చోట ఆడకూడదు అన్న రూల్ ఏమి లేదు కానీ చాలా వరకు ఒరిజినల్ రేంజ్ లోనే రీమేక్ లు కూడా రెస్పాన్స్ ను తెచ్చుకుంటాయి… కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చుకుంటాయి. లేటెస్ట్ గా ఇలాంటిదే జరిగింది బాలీవుడ్ రీమేక్ మూవీ పై… కృతి సనన్ హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ మీమీ నెట్ ఫ్లిక్స్ లో…
డైరెక్ట్ రిలీజ్ ను 30 న అనుకున్నారు కానీ సినిమా 5 రోజుల ముందే ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. దాంతో సినిమా ను ఉన్న పళంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఇక త్వరగా రిలీజ్ చేసినప్పటికీ సినిమా కి లీక్ అవ్వడం తో ఫుల్ పబ్లిసిటీ దక్కింది.
దాంతో సినిమా కి సాలిడ్ వ్యూవర్ షిప్ తో పాటు సినిమా చూసిన వారు అందరూ కూడా సినిమా అద్బుతంగా ఉందీ అంటూ మెచ్చుకోవడం తో అల్టిమేట్ రివ్యూలు కూడా దక్కాయి. అద్దె గర్బం అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లుగా ఉండటం తో…
ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటూ ఉండగా ఈ సినిమా 8 ఏళ్ల క్రితం తెలుగు లో రూపొందిన సినిమా రీమేక్ అని అంటున్నారు. తెలుగు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందిన వెల్ కం తో ఒబామా పేరుతో సినిమాను రూపొందించగా అందరూ కొత్త నటీనటులు నటించడం పెద్దగా ప్రమోషన్ చేయక పోవడం అండ్ సినిమా కూడా…
చాలా సీరియస్ నోట్ తో తెరకేక్కడం లాంటివి సినిమా ఫ్లాఫ్ అయ్యేలా చేశాయి, కానీ రివ్యూలు పాజిటివ్ గానే వచ్చినా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు. కానీ ఫ్లాఫ్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన మీమీ లో కామెడీ వర్కౌట్ అవ్వడం తెలిసిన నటీనటులు ఉండటం కలిసి వచ్చి సాలిడ్ రివ్యూలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఈ సినిమా..