Home TRP రేటింగ్ 8 ఏళ్ల క్రితం వచ్చిన రచ్చ, 4 ఏళ్ల క్రితం మాస్ సరైనోడు…భోజ్ పూరి TRP...

8 ఏళ్ల క్రితం వచ్చిన రచ్చ, 4 ఏళ్ల క్రితం మాస్ సరైనోడు…భోజ్ పూరి TRP రికార్డులు ఔట్!

0

మాస్ మూవీస్ కి ఎప్పటి కైనా క్రేజ్ ఏమాత్రం తగ్గదు అని చాలా సినిమాలు ఇప్పటికే అనేక సార్లు నిరూపించాయి, బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన మాస్ మూవీస్ కి టెలివిజన్ లో తిరుగు లేని TRP రేటింగ్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం, ఇక ఇది వరకు వచ్చిన మాస్ మూవీస్ ఇప్పుడు హిందీ లో డబ్ అయ్యి అక్కడ కూడా దుమ్ము లేపుతూ ఉండగా అందులో కొన్ని సినిమాలు…

భోజ్ పూరి లో కూడా డబ్ అవుతూ వారం వారం టెలికాస్ట్ అవుతూ దూసుకు పోతున్నాయి, లాస్ట్ వీక్ ఎన్టీఆర్ నటించిన ఓల్డ్ మూవీ దమ్ము అక్కడ సాలిడ్ గా 23.82 లక్షల ఇంప్రెషన్స్ ని అందుకుని రికార్డ్ అందుకోగా లాస్ట్ వీక్ మరిన్ని సినిమాలు అక్కడ టెలికాస్ట్ అయ్యి దుమ్ము లేపాయి.

వాటిలో 8 ఏళ్ల క్రితం వచ్చిన రామ్ చరణ్ రచ్చ సినిమా ఒకటి కాగా మరోటి 4 ఏళ్ల క్రితం వచ్చిన అల్లు అర్జున్ సరైనోడు సినిమా ఇప్పటికే అనేక రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు భోజ్ పూరి లో హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా గా…

ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది, ఈ సినిమాకి 31 లక్షల 8 వేల ఇంప్రెషన్స్ ని సాధించి టాప్ లో నిలిచింది, ఇక రచ్చ సినిమా కి 30 లక్షల 82 వేల ఇంప్రెషన్స్ ని అందుకుని ఆల్ టైం టాప్ 2 ని సొంతం చేసుకుంది, ఇక 5 వ ప్లేస్ లో రామ్ నటించిన ఎందుకంటే ప్రేమంట సినిమా కూడా నిలిచింది.

ఈ సినిమాకి 22 లక్షల 27 వేల ఇంప్రెషన్స్ దక్కడం విశేషం, మొత్తం మీద భోజ్ పూరి సినిమాల్లో కూడా మన సినిమాలు డామినేట్ చేస్తూ ఉండటం విశేషం, సింపుల్ గా మన లెక్కల్లో TRP చెప్పాలి అంటే, సరైనోడు కి 4.5 TRP, రచ్చకి 4.1 అలాగే ఎందుకంటే ప్రేమంట సినిమాకి 2.8 రేటింగ్ దక్కాయి అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here