Home TRP రేటింగ్ అమ్మింది 4.5 కోట్లు….మూడో సారి కూడా కుమ్మేసిన “KGF” TRP

అమ్మింది 4.5 కోట్లు….మూడో సారి కూడా కుమ్మేసిన “KGF” TRP

0

రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న సినిమా KGF, కన్నడ తప్పితే మిగిలిన చోట్ల పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ మిక్సుడ్ గా వచ్చినా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత ఈ సినిమా లాంగ్ రన్ లో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. కన్నడ సినిమాల్లో మొట్ట మొదటి 200 కోట్ల సినిమాగా నిలిచింది.

అలాంటి చారిత్రిక విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్మకానికి చాలా టైం పట్టింది, 2 ఏళ్ల తర్వాత సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానెల్ సుమారు 4.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా…

సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 11.9 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా రెండో సారి టెలికాస్ట్ కూడా తక్కువ గ్యాప్ లోనే టెలికాస్ట్ అయినా కానీ మళ్ళీ హోల్డ్ చేసి 8.12 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇక మళ్ళీ తక్కువ గ్యాప్ తో సినిమా…

రీసెంట్ గా మూడో సారి కూడా టెలికాస్ట్ అవ్వగా ఈ సారి కూడా సినిమా భారీ పోటి ని ఎదురుకుని కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకోవడం విశేషం, లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్ లో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంటూ 5.12 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని మళ్ళీ హోల్డ్ ని చూపెట్టింది ఈ సినిమా.

మొత్తం మీద లేట్ టెలికాస్ట్ అయినా 4.5 కోట్ల రేటు కి తగ్గ న్యాయం చేస్తూ సినిమా టెలివిజన్ లో మంచి రేటింగ్స్ తో దుమ్ము లేపుతుండటం విశేషం కాగా ఇక సినిమా రెండో పార్ట్ షూటింగ్ రీసెంట్ గా మొదలు అవ్వగా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ సంక్రాంతి కి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here