బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో కన్నడ నుండి పాన్ ఇండియా మూవీ గా రూపొంది గ్రాండ్ గా రిలీజ్ అయిన ధృవ్ సార్జా(Dhruva Sarja) నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్(Martin Movie Collections) సినిమా దసరా కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే ఆడియన్స్ నుండి భారీ లెవల్ లో మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…
ఒక కర్ణాటకలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధించినా కూడా మిగిలిన చోట్ల మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించలేదు….ఇక సినిమా బడ్జెట్ పరంగా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా బడ్జెట్ కి ఏమాత్రం సంభందం లేని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.
సినిమా మొత్తం మీద బడ్జెట్ ఏకంగా 75-80 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు పూర్తి అయ్యే టైంకి 2 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా కోటి లోపే షేర్ ని అందుకోగా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది..
దాంతో తెలుగు సినిమా రిజల్ట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది అనే చెప్పాలి. ఇక సినిమా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Martin 8 Days Total WW Collections Report
👉Karnataka- 20.05Cr~
👉Telugu States- 2.05Cr~
👉ROI – 2.00Cr~
👉Overseas – 2.10CR~***(EST)
Total WW Collections – 26.20CR(12.90CR~ Share)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 30 కోట్ల కి పైగా అయినా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉండగా సినిమా ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక….