Home న్యూస్ 24 గంటల రికార్డ్…8 గంటల్లో ఔట్….ఎన్టీఆర్ ఊరమాస్ ఊచకోత!

24 గంటల రికార్డ్…8 గంటల్లో ఔట్….ఎన్టీఆర్ ఊరమాస్ ఊచకోత!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) RRR మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు కొరటాల శివ(Koratala Shiva) డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా దేవర(Devara Part 1) మీద అందరిలోనూ సాలిడ్ గానే అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఇప్పుడు…

ఆడియన్స్ ముందుకు సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కి గ్లిమ్స్ ఎండ్ లో తప్పితే మిగిలిన చోట్ల కొంచం రెస్పాన్స్ మిక్సుడ్ గా ఉన్నా ఓవరాల్ గా గ్లిమ్స్ అదిరిపోవడంతో యూట్యూబ్ రికార్డుల వేటను…

మొదలు పెట్టిన దేవర గ్లిమ్స్ ప్రీవియస్ టాలీవుడ్ రికార్డులను వ్యూస్ పరంగా ఊచకోత కోస్తూ కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇది వరకు టాలీవుడ్ గ్లిమ్స్ పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న రికార్డ్ గుంటూరు కారం(Guntur Kaaram) గ్లిమ్స్ పేరిట ఉండగా, ఆ గ్లిమ్స్ 24 గంటల్లో…..

20.98 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది, కానీ దేవర గ్లిమ్స్ ఈ రికార్డ్ ను కేవలం 8 గంటల లోనే బ్రేక్ చేసి టాలీవుడ్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం..8 గంటల్లో ప్రీవియస్ రికార్డ్ ఔట్ కాగా ఇప్పుడు 24 గంటల్లో ఇండియన్ సింగిల్ ఛానెల్ రికార్డ్ పై కన్నేసింది ఈ గ్లిమ్స్…. 24 గంటల్లో ఇది వరకు పుష్ప2 గ్లిమ్స్….

27.67 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది… ఆ రికార్డ్ ను ఇప్పుడు దేవర తెలుగు వర్షన్ గ్లిమ్స్ బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక లైక్స్ పరంగా టాలీవుడ్ రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉండగా ఇండియన్ రికార్డులు అందుకోవాలి అంటే ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here