Home న్యూస్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

0

సంతోష్ శోభన్ హీరోగా ఫారియా హీరోయిన్ గా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది, సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై లిమిటెడ్ గా బజ్ ఏర్పడగా టీం సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. మరి సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా సినిమా స్టొరీ పాయింట్ కి వస్తే… కథ ఓపెన్ అవ్వడం 90’s లో నక్సల్స్ కాన్సెప్ట్ తో ఓపెన్ అయ్యి తర్వాత ప్రజెంట్ టైం కి రాగా హీరో ట్రావెల్ వ్లాగర్ గా తన కెరీర్ ని కొనసాగిస్తూ ఉండగా తన ఛానెల్ కి చాలా మంది సబ్ స్క్రైబర్స్ కావాలని కోరుకుంటూ అరకు వాలీలో వ్లాగ్స్ చేయడానికి వెళ్ళగా మరో పక్క టాప్ యూట్యూబర్ అయిన ఫారియా కూడా అక్కడికి వెళుతుంది…

అక్కడ హీరోయిన్ ని చూసి ఇష్టపడే హీరో తర్వాత ఏం చేశాడు, అసలు ఈ కథని నక్సల్స్ కి లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా సంతోష్ శోభన్ ఆకట్టుకోగా ఫారియా కూడా బాగా నటించింది, బ్రహ్మాజీ కామెడీ అక్కడక్కడా బాగానే వర్కౌట్ అయింది. మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించుకున్నారు…

ఓవరాల్ గా కథ చాలా సిల్లీగా ఉండగా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించినా కానీ ఎక్కడా కూడా సినిమా కథ ఎంగేజింగ్ గా అనిపించలేదు, సిల్లీ పాయింట్ తో సిల్లీ నరేషన్ తో తీసిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ చాలా వరకు బోర్ ఫీల్ అయ్యేలా చేసింది… ముందే చెప్పినట్లు కొన్ని కామెడీ సీన్స్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమి లేవనే చెప్పాలి…

టోటల్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా సినిమాలో మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి…. బ్రహ్మాజీ కామెడీ, అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం మాత్రమే ప్లస్ పాయింట్స్…. మొత్తం మీద సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ ని కూడా మెప్పించే అవకాశం చాలా తక్కువే… మొత్తం మీద సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here