బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరికొంత కష్టపడాల్సిన అవసరం ఉండగా రెండో వీక్ లో సైతం ఒక పక్క…
సంక్రాంతికి వస్తున్నాం ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా డాకు మహారాజ్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ రన్ ని కొనసాగిస్తుంది. సినిమా 8వ రోజు ఆల్ మోస్ట్ 7వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ ని అయితే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతుంది..
కానీ నైజాంలో నైట్ షోలకు డ్రాప్స్ కొంచం ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 2-2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే…
షేర్ మరికొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓకే అనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు సినిమా 8వ రోజున 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 2.7 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సాధించే అవకాశం ఉంది. అంతకుమించి కనుక సినిమా షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు. ఇక సినిమా టోటల్ గా 8 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.