బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వారంలో కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star Movie) నుండి పోటి వలన స్క్రీన్స్ ను…
చాలా వరకు కోల్పోయినా కూడా ఉన్న స్క్రీన్స్ లోనే పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తున్న సినిమా ఉన్నంతలో డే 7తో పోల్చితే డే 8 రోజున 40-45% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…. ఉన్నంతలో నైట్ షోలకు మంచి జోరునే చూపిస్తూ ఉన్న సినిమా ఓవరాల్ గా…
ఇప్పుడు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 8వ రోజున 80 లక్షల రేంజ్ నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1 కోటి మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
1.2 కోట్ల రేంజ్ నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరగవచ్చు. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.