టాలీవుడ్ లో టాప్ స్టార్స్ చాలా మందే ఉండగా ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే ఎక్కువ మంది టాప్ స్టార్స్ ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్ అనే చెప్పాలి, అలాగే మీడియం రేంజ్ హీరోల విషయానికి వస్తే ఇక్కడ కూడా చాలా మందే మీడియం రేంజ్ హీరోలు ఉన్న ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ అనే చెప్పాలి… టాప్ స్టార్ మూవీస్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర….
100 కోట్లు అనేది బెంచ్ మార్క్ అయితే మీడియం రేంజ్ హీరోలకి బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల షేర్ మార్క్ అనేది చాలా ముఖ్యం అని చెప్పాలి. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో 8 మంది ఇప్పటి వరకు 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా లేటెస్ట్ గా ఈ లిస్టులో 9వ హీరోగా సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie)
40 కోట్ల షేర్ మార్క్ 4 రోజుల్లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఉప్పెన(Uppena) తో పంజా వైష్ణవ్ తేజ్ అలాగే హనుమాన్(Hanuman) తో తేజ సజ్జాలు కూడా ఈ మార్క్ ని దాటేసినా కూడా అప్ కమింగ్ మూవీస్ తో ఎంతవరకు జోరు చూపిస్తారో చూసి ఈ లిస్టులో అప్ డేట్ చేయోచ్చు…
డిజే టిల్లుతో బ్లాక్ బస్టర్ అందుకుని ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో 40 కోట్ల మార్క్ ని అందుకుని కేవలం తన వల్లే సినిమా హిట్ అయ్యేలా చేసుకుని సిద్హూ జొన్నలగడ్డ సంచలనం సృష్టించాడు… ఒకసారి టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో 40 కోట్ల మార్క్ ని అందుకున్న హీరోలను గమనిస్తే…
1. విజయ్ దేవరకొండ(గీతగోవిందం): 70.5 కోట్లు
2. నాని (దసరా): 63.55 కోట్లు
3. నిఖిల్ సిద్దార్థ్(కార్తికేయ2) : 58.40 కోట్లు
4. నితిన్(అ.ఆ):49 కోట్లు++
5. వరుణ్ తేజ్(ఫిదా): 48.5 కోట్లు
6. సాయి ధరం తేజ్( విరూపాక్ష ): 48.20కోట్లు
7. రామ్(ఇస్మార్ట్ శంకర్): 40.56 కోట్లు
8. సిద్హూ జొన్నలగడ్డ(టిల్లు స్క్వేర్): 40.31 కోట్లు******
9. నాగ చైతన్య( మజిలి): 40.23 కోట్లు
10. నవీన్ పొలిశెట్టి(జాతిరత్నాలు): 38.52 కోట్లు
11. కళ్యాణ్ రామ్(బింబిసార) : 37.92 కోట్లు
టైర్2 హీరోల లిస్టులోకి తన టాలెంట్ తో ఎంటర్ అయిన సిద్హూ జొన్నలగడ్డ ఇక అప్ కమింగ్ మూవీస్ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.