Home న్యూస్ మార్క్ అంథోని రివ్యూ… ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

మార్క్ అంథోని రివ్యూ… ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

కోలివుడ్ హీరో విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony Movie Telugu Review) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ మరియు ప్రోమోలు సినిమా మీద మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేయగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే తండ్రి కొడుకులు అయిన హీరో విశాల్ ప్రజెంట్ టైంలో మెకానిక్ కాగా అనుకోకుండా ఒక టైం మిషన్ లో వెనక్కి తన తల్లిని కాపాడుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో జరిగిన సంఘటనలు ఏంటి ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా స్టోరీ పాయింట్ క్రేజీగా ఉండగా కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైంలో కథ కొంచం స్లోగా సాగగా అసలు కథలోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా స్క్రీన్ ప్లే బాగుంటుంది… ఆసక్తిని బాగా పెంచే విధంగా సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పించగా…

సెకెండ్ ఆఫ్ లో కథ కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ బాగుండగా సినిమా కథ కొన్ని చోట్ల కన్ఫ్యూజింగ్ గా అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమాలో ఎంటర్ టైన్ మెంట్, మెయిన్ స్టోరీ పాయింట్ కొన్ని ఆసక్తి కలిగించే సీన్స్ తో పాటు….

ఎస్ జే సూర్య ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా మారి సినిమా పూర్తి అయిన తర్వాత ఆడియన్స్ సాటిస్ ఫై గా థియేటర్స్ బయటికి రావడం ఖాయం… విశాల్ కూడా తన రోల్ లో బాగా నటించినా ఎస్ జే సూర్య కుమ్మేశాడు. సాంగ్స్ కొంచం వీక్ గా ఉండటం…

లెంత్ కొంచం ఎక్కువగా ఉండటం, అక్కడక్కడా కొంచం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసినా కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి బాగుంది అనిపించేలా సినిమా ముగుస్తుంది… కొంచం లెంత్ తగ్గించి ఫస్టాఫ్ లో మరింత ఎంటర్ టైన్ మెంట్ జోడించి ఉంటే…

సినిమా ఇంకా బాగుండేది… అయినా కానీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి అక్కడక్కడా కొంచం బోర్ అనిపించినా ఓవరాల్ కాన్సెప్ట్ యూనిక్ గా ఉండటం, ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ అయ్యి సినిమా ఎండ్ అయ్యే టైం బాగుంది అనిపించేలా మెప్పించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి….

విశాల్ రీసెంట్ మూవీస్ తో పోల్చినా చాలా బెటర్ కంటెంట్ తో వచ్చిన సినిమాగా మార్క్ అంథోని సినిమాను చెప్పొచ్చు. వీకెండ్ లో డీసెంట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను చెప్పొచ్చు. మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here