బాక్స్ ఆఫీస్ దగ్గర విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా తమిళ్ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉండటంతో తెలుగు లో సినిమా పెద్దగా జోరు చూపించలేక పోయింది…
కానీ తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ లో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 38-40 కోట్లకు పైగా గ్రాస్ ను మినిమం వసూల్ చేస్తుంది అనుకుంటే అంచనాలను మించి పోయి ఏకంగా 42 కోట్ల కు పైగా గ్రాస్ ను అందుకోవడం విశేషం అని చెప్పాలి.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజున 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 65 లక్షల షేర్ ని సాధించింది. టోటల్ గా వీకెండ్ లో తెలుగు లో 2.00 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. తెలుగు వాల్యూ బిజినెస్ 4 కోట్ల దాకా ఉంటుందని అంచనా…ఆ లెక్కన బ్రేక్ ఈవెన్ కి…4.50 కోట్లు కావాలి…
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony 3 Days WW Collections Report
👉Tamilnadu – 26.55Cr
👉Telugu States- 3.70Cr
👉Ka+ROI – 4.05Cr
👉Overseas – 8.40CR~***
Total WW Collections – 42.70CR(21.00CR~ Share)
మొత్తం మీద సినిమా విశాల్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక ఈ రోజు వినాయక చవితి ఉండటంతో సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.