ట్రైలర్ బాగుంటే సినిమా మీద ఆటోమాటిక్ బజ్ అనేది క్రియేట్ అవ్వడం ఖాయం… లాస్ట్ ఇయర్ బింబిసార(Bimbisara) సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ఆ సినిమా తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాడు…
కానీ ఆ సినిమా తర్వాత చేసిన అమిగోస్ భారీగా డిసాస్టర్ అయ్యింది. దాంతో ఆ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న డెవిల్(Devil – The British Secret Agent) సినిమా ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత…
సినిమా మీద ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ అయితే పెరిగింది అని చెప్పాలి. దాంతో ఆ క్యూరియాసిటీ సినిమా బిజినెస్ పరంగా మంచి జోరుని చూపించడానికి హెల్ప్ అవ్వగా రిలీజ్ కి ఇంకా 10 రోజులకు పైనే టైం ఉండగానే సినిమా కి అన్ని చోట్లా మంచి బిజినెస్ డీల్స్ జరుగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
అమిగోస్ భారీ డిసాస్టర్ అయినా కూడా డెవిల్ సినిమాకి ఆంధ్ర ఏరియాకి గాను ఏకంగా 8.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం అయ్యిందట. పోటిలో సలార్(salaar part 1 – ceasefire) వచ్చిన వారానికి వస్తున్నా కూడా ఇలాంటి బిజినెస్ డిసాస్టర్ తర్వాత సొంతం చేసుకోవడం విశేషమే…
ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడం సినిమాకి కలిసి వస్తూ ఉండగా మిగిలిన ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ ఆఫర్స్ తో దూసుకు పోతున్న డెవిల్ మూవీ ఓవరాల్ గా డిసాస్టర్ తర్వాత సాలిడ్ బిజినెస్ చేయబోతుంది. ఇక సినిమా కూడా ట్రైలర్ మెప్పించినట్లు మెప్పిస్తే సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ఈ సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది.