బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో అంచనాలు ఉన్నా కూడా ఒకవేళ తేడా కొడితే అసలుకే మోసం అయ్యే అవకాశం ఉన్న సినిమాగా అనిపించిన హనుమాన్(HanuMan Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పాటు సూపర్ డూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మిగిలిన సినిమాలను…
ఫుల్లుగా డామినేట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా ప్రీమియర్ షోలతో మొత్తం మీద 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ తో పరుగును మొదలు పెట్టగా ఇప్పుడు 5 రోజుల్లో ఓవరాల్ లెక్క ఏకంగా 115 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా… తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున మొత్తం మీద…
9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా హిందీలో 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండటంతో…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో సినిమా 47 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా…
ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద 9 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో ఓపెన్ అయిన ఓ చిన్న సినిమా 5 రోజుల్లోనే 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మాస్ ఊచకోత కోయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.