బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి ముందు అన్ని పెద్ద సినిమాల నడుమ ఏమాత్రం టాక్ మిక్సుడ్ గా ఉన్నా భారీ ఎదురుదెబ్బ పడటం ఖాయం అనుకున్న హనుమాన్(HanuMan Movie) అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఊహకందని పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర…
సెన్సేషనల్ కలెక్షన్స్ తో అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఊచకోత కోస్తుంది, రీసెంట్ టైంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండింగ్ మూవీ అని చెప్పొచ్చు. 10వ రోజు అంచనాలను అన్నీ మించి పోయిన హనుమాన్ మూవీ తెలుగు రాష్ట్రలలో 7.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Hanuman Day Wise Collections(INC GST)
👉Premieres – 2.85CR~
👉Day 1 – 5.12CR
👉Day 2 – 4.36CR
👉Day 3 – 5.70CR
👉Day 4 – 6.00CR
👉Day 5 – 6.04CR
👉Day 6 – 5.53CR
👉Day 7 – 4.55CR
👉Day 8 – 4.75CR
👉Day 9 – 5.81CR
👉Day 10 – 7.91CR
AP-TG Total:- 59.51CR (98.15CR~ Gross)
ఏ సినిమా అయినా రోజులు గడుస్తున్న కొద్ది కలెక్షన్స్ తగ్గుతాయి, కానీ హనుమాన్ మాత్రం ప్రతీ రోజూ ఊహకందని రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 20.65 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 38.86 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఇక మిగిలిన రన్ లో ఇలానే సినిమా జోరు చూపిస్తే తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ రన్ లో 80 కోట్లకు పైగానే వసూళ్ళని సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.