బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే అంతకుమించిన ప్రమోషన్ పబ్లిసిటీ ఏవి కూడా చేయలేదు…. మిగతాదంతా బోనస్ అని చెప్పొచ్చు, కానీ టాక్ పాజిటివ్ గా వచ్చిన సినిమాలు అన్నింటికీ జనాలు ఎగబడి థియేటర్స్ కి వెళ్లి చూస్తారు అనుకోవడం తప్పే….రీసెంట్ గా బాలీవుడ్ లో రంజాన్ లాంటి పెద్ద పండగకి రిలీజ్ అయ్యి…
యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకున్న అజయ్ దేవగన్(Ajay Degvn) నటించిన మైదాన్(Maidaan Movie) కి యునానిమస్ రివ్యూలు సొంతం అయ్యాయి. సినిమా కొంచం లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది అనిపించేలా టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ లో సాలిడ్ గ్రోత్ ని సినిమా…
సొంతం చేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ అలాంటిది ఏమి జరగలేదు….సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కి 2.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే రంజాన్ హాలిడే రోజున 4.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి 7.1 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…
రెండో రోజు శుక్రవారం మంచి జోరు చూపుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా కేవలం 2.8 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. అంటే మొత్తం మీద ప్రీమియర్స్ అండ్ 2 డేస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా కేవలం 10 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకుంది…
ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ ఎందుకో అనుకున్న రేంజ్ లో ఈ సినిమాను పట్టించుకోవడం లేదు, రీసెంట్ గా అజయ్ దేవగన్ నటించిన సైతాన్ డీసెంట్ రివ్యూలతో బాక్స్ ఆఫీస్ దగ్గర 140 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఆ సినిమా కన్నా బెటర్ రివ్యూలు సాధించిన మైదాన్ మాత్రం ఏమాత్రం గ్రోత్ ని చూపించడం లేదు ఇప్పుడు.