బాక్స్ ఆఫీస్ దగ్గర తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను లాస్ట్ ఇయర్ మార్క్ అంథోని(Mark Antony Movie) తో సొంతం చేసుకున్నాడు విశాల్(Vishal)…టాక్ మరీ యునానిమస్ గా రాక పోయినా కూడా తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో తమిళ్ తెలుగు కలిపి టోటల్ గా 102 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది… తెలుగు లో కూడా 4.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బిజినెస్ ను రికవరీ చేసింది…ఈ సినిమా గ్రాండ్ విజయం తర్వాత తన కెరీర్ లో పూజా లాంటి హిట్ మూవీని ఇచ్చిన డైరెక్టర్ హరి డైరెక్షన్ లో ఇప్పుడు విశాల్ చేస్తున్న కొత్త సినిమా రత్నం(Ratnam Movie WW Business)…
మూవీతో ఆడియన్స్ ముందుకు ఈ నెల 26న గ్రాండ్ గా తమిళ్ తెలుగు లో రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు లో సినిమా కొన్ని చోట్ల ఓన్ గా కొన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ అవుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ రేంజ్ మరో సారి 4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…
రీసెంట్ విశాల్ మూవీస్ బిజినెస్ లు అన్నీ కూడా ఇదే రేంజ్ లో ఉండగా ఇప్పుడు రత్నం మూవీ కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా తెలుగు లో సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
తమిళ్ ఓవరాల్ బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా తెలుగు లో పెద్దగా పోటి ఏమి లేకుండానే రిలీజ్ కానుండటంతో సమ్మర్ అడ్వాంటేజ్ ను సినిమా ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి. హిట్ టాక్ వస్తే తెలుగు లో టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు.